నేడు పులివెందులలో జగన్ పర్యటన

నేటి భారత్ న్యూస్- మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ రోజు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వడగళ్ల వానతో దెబ్బతిన్న అరటి తోటలను జగన్ పరిశీలించనున్నారు. నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు. ఉదయం 8.30 గంటలకు పులివెందులలోని నివాసం నుంచి బయలుదేరి లింగాల మండలానికి జగన్ చేరుకుంటారు. లింగాల మండలంలో వడగళ్ల వాన కారణంగా వేలాది ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న అరటి తోటలను జగన్ పరిశీలించిన అనంతరం అరటి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. తదుపరి, వేంపల్లిలో జెడ్‌పీటీసీ రవి నివాసంలో జరిగే శుభకార్యానికి జగన్ హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి ఇడుపులపాయ చేరుకుని, అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. కాగా, పులివెందులలో ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయభాస్కర్‌ రెడ్డి మృతి చెందడంతో నిన్న సాయంత్రం ఆయన భౌతిక కాయానికి జగన్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

Related Posts

రేవంత్ రెడ్డి అప్పుడు, ఇప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై ఏడుస్తున్నారు: హరీశ్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై విమర్శలు చేశారని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ శాసనసభకు హాజరుకాకపోవడం వల్ల నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కావడం లేదని గజ్వేల్…

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

నేటి భారత్ న్యూస్-‘‘మూడేళ్ల తర్వాత అధికారం మనదే. అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా, అప్పటి వరకు ధైర్యంగా ఉండు’’ అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్‌కు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

రేవంత్ రెడ్డి అప్పుడు, ఇప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై ఏడుస్తున్నారు: హరీశ్ రావు

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేశ్

రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేశ్

నేపాల్‌లో వివాహ వయసు 20 నుంచి 18కి తగ్గింపు!

నేపాల్‌లో వివాహ వయసు 20 నుంచి 18కి తగ్గింపు!

మ‌హేంద్రుడా మ‌జాకా… వింటేజ్ ధోనీని గుర్తు చేశాడుగా..

మ‌హేంద్రుడా మ‌జాకా… వింటేజ్ ధోనీని గుర్తు చేశాడుగా..

 నేడు ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశవర్కర్ల పిలుపు .. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు

 నేడు ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశవర్కర్ల పిలుపు .. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు