నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రైతు భరోసా ఇవ్వడం లేదని, రుణమాఫీ పూర్తి చేయరని, పంట నష్ట పరిహారం ఇవ్వరని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ మార్క్ రైతు సంక్షేమ రాజ్యమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల స్టేచర్ గురించి కాకుండా… రైతుల ఫ్యూచర్ గురించి ఆలోచించాలని అన్నారు.  అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించాలని బండి సంజయ్ సూచించారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలని. యాసంగి పూర్తయ్యేంత వరకు నీళ్లు వదలాలని కోరారు. కాలువల్లో నీళ్లున్నా ఎందుకు వదలడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు ఎందుకు మూల్యం చెల్లించాలని ప్రశ్నించారు.   10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నా ప్రభుత్వానికి అన్నదాతల ఆక్రందనలు వినిపించడం లేదని సంజయ్ మండిపడ్డారు. ప్రతి విషయాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టేసి రేవంత్ ప్రభుత్వం తప్పించుకోవాలనుకుంటోందని విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని అన్నారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌