పాకిస్థాన్‌కు మ‌రో ఘోర ఓట‌మి

నేటి భారత్ న్యూస్- న్యూజిలాండ్‌ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు మ‌రో ఓట‌మి ఎదురైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ జ‌రిగిన రెండో టీ20లో పాక్‌ను ఆతిథ్య కివీస్ 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పాక్ నిర్దేశించిన 136 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మ‌రో 11 బంతులు మిగిలి ఉండ‌గానే ఆతిథ్య జ‌ట్టు చేధించింది. కాగా, తొలి టీ20లోనూ స‌ల్మాన్ అఘా సారథ్యంలోని పాక్ జ‌ట్టు ప‌రాజ‌యం పాలైన విష‌యం తెలిసిందే.  ఇక ఇవాళ్టి మ్యాచ్‌ను వ‌ర్షం కార‌ణంగా 15 ఓవ‌ర్ల‌కు కుదించారు. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 15 ఓవ‌ర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 ప‌రుగులు చేసింది. కెప్టెన్ స‌ల్మాన్ అఘా 46 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. స‌దాబ్ ఖాన్ 26, షాహీన్ షా అఫ్రిది 22 ర‌న్స్ చేయ‌గా.. మిగ‌తా బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో జాక‌బ్ డ‌ఫ్పీ, బెన్ సీయ‌ర్స్‌, జేమ్స్ నీష‌మ్‌, ఇష్ సోధీ త‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం 136 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన కివీస్ 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. 13.1 ఓవ‌ర్ల‌లోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెన‌ర్లు టిమ్ సీఫ‌ర్ట్‌, ఫిన్ అలెన్‌ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పాక్ బౌల‌ర్లపై విరుచుకుప‌డ్డారు. తొలి వికెట్‌కు ఈ ద్వ‌యం 66 పరుగుల భాగ‌స్వామ్యాన్ని అందించింది. సీఫ‌ర్ట్ (45), ఫిన్ (38), మిచెల్ హే (21) రాణించ‌డంతో న్యూజిలాండ్ 5 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. పాక్ బౌల‌ర్ల‌లో హ‌రీస్ రౌఫ్ 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా… మ‌హ్మ‌ద్ అలీ, కుష్దీల్ షా, జ‌హాందాద్ ఖాన్ చెరో వికెట్ తీశారు. ఈ విజ‌యంతో కివీస్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 తేడాతో లీడ్‌లోకి దూసుకెళ్లింది.  

Related Posts

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

నేటి భారత్ న్యూస్- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమైన విషయం విదితమే. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అటు నియోజకవర్గానికి కానీ, ఇటు అసెంబ్లీకి కానీ వెళ్లడంలేదు. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల…

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

నేటి భారత్ న్యూస్త– మిళనాడులోని తిరువణ్ణామలై కొండపై ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫ్రాన్స్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ గత జనవరిలో తిరువణ్ణామలైను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

 గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

 గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

భారత్ లో కాలు మోపుతున్న ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ

భారత్ లో కాలు మోపుతున్న ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ