పాకిస్థాన్ క్రికెట్ బోర్డు న‌వ్వుల‌పాలు.. వీళ్లా వ‌ర‌ల్డ్‌క‌ప్ ను నిర్వ‌హించేదంటూ ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు!

నేటి భారత్ న్యూస్- ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌లో జ‌రుగుతున్న మ్యాచ్‌ల‌ను వ‌రుణుడు వెంటాడుతున్నాడు. రావ‌ల్పిండి వేదిక‌గా జ‌ర‌గాల్సిన‌ రెండు మ్యాచ్‌లు (ఆస్ట్రేలియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వ‌ర్సెస్ పాకిస్థాన్‌)తో పాటు, నిన్న లాహోర్‌లో జరగాల్సిన ఆసీస్‌, ఆఫ్ఘన్ కీల‌క‌ మ్యాచ్‌ కూడా వ‌ర్షార్ప‌ణం అయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టాల‌నుకున్న ఆఫ్ఘ‌నిస్థాన్ ఆశ‌ల‌పై వ‌రుణుడు నీళ్లు చ‌ల్లాడు.ఈ మ్యాచ్‌లో మొద‌ట టాస్ గెలిచిన ఆఫ్ఘ‌న్ బ్యాటింగ్ చేసింది. 273 ప‌రుగులు చేసి, ఆసీస్ ముందు భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. అనంత‌రం ఆస్ట్రేలియా ఛేద‌న‌కు దిగిన స‌మయంలో వ‌ర్షం ఆటంకం క‌లిగించింది. 12.5 ఓవ‌ర్ల‌లో ఆసీస్‌ వికెట్ న‌ష్టానికి 109 ర‌న్స్ వ‌ద్ద ఉన్న‌ప్పుడు వ‌ర్షం కుర‌వ‌డం మొద‌లైంది. అర‌గంట పాటు దంచి కొట్టింది. దాంతో మైదానం చిత్తడిగా మారింది. గ్రౌండ్ స్టాఫ్ గంట‌కు పైగా క‌ష్ట‌పడ్డప్పటికీ ఫ‌లితం లేకుండా పోయింది. మైదానం సిద్ధం కాక‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు.అయితే, కేవ‌లం అర‌గంట పాటే వ‌ర్షం కుర‌వ‌గా, మ్యాచ్ నిర్వ‌హ‌ణ సాధ్యం కాక‌పోవ‌డంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు విమ‌ర్శ‌ల‌కు దిగారు. వ‌ర్షం ప‌డిన త‌ర్వాత నీటిని మైదానం సిబ్బంది బ‌య‌టికి పంపిన తీరు, క‌వ‌ర్ల‌ను తీసిన పధ్ధతి న‌వ్వుల పాలైంది. దాంతో వీళ్లా వ‌ర‌ల్డ్‌క‌ప్ నిర్వ‌హించేదంటూ ఏకిపారేస్తున్నారు. ఇంకెప్పుడూ పాకిస్థాన్‌కు ఐసీసీ ఈవెంట్లు నిర్వ‌హించే అవ‌కాశం ఇవ్వొద్ద‌ని మండిప‌డుతున్నారు.

  • Related Posts

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌