నేటి భారత్ న్యూస్- పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణంపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మంత్రి లోకేశ్ పోస్టు పెట్టారు. "పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. వివిధ సంఘాలు పాస్టర్ గారి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తాం" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.