పుస్తకాలలో డాలర్ నోట్లు దాచి దుబాయ్ తీసుకెళ్లిన విద్యార్థులు.. తిరిగి రప్పించిన పూణే కస్టమ్స్ అధికారులు

నేటి భారత్ న్యూస్- అమెరికన్ డాలర్ నోట్లను పుస్తకాలలో దాచి తరలిస్తున్న విద్యార్థులను పూణే కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. సుమారు 4 లక్షల డాలర్ల విలువైన నోట్లతో దేశం దాటిన వారిని వెనక్కి రప్పించారు. ఆపై వారి నుంచి రూ. 3.5 కోట్ల విలువైన డాలర్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ డాలర్ నోట్లను ట్రావెల్ ఏజెంట్ వారికి ఇచ్చి, దుబాయ్ లోని తమ ఆఫీసులో ఇవ్వాలని కోరిందని బయటపడింది. దీంతో సదరు ట్రావెల్ ఏజెంట్ ను, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారంలో పూణే ఎయిర్ పోర్టులో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు..మహారాష్ట్రకు చెందిన ముగ్గురు విద్యార్థులు దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేశారు. పూణేకు చెందిన ట్రావెల్ ఏజెంట్ ఖుష్బు అగర్వాల్ ను ఆశ్రయించి టికెట్లు బుక్ చేసుకున్నారు. పూణే ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ బయలుదేరారు. చివరి క్షణంలో విమానాశ్రయంకు వచ్చిన ఏజెంట్.. ఆ విద్యార్థులకు రెండు ట్రాలీ బ్యాగులు అందించి వాటిని దుబాయ్ లోని తన ఆఫీసులో అందజేయాలని కోరింది. అందులో అమెరికన్ కరెన్సీ ఉన్న విషయం తెలియక విద్యార్థులు ముగ్గురూ ఆ బ్యాగులను తీసుకుని దుబాయ్ విమానం ఎక్కారు. ఆ తర్వాత కస్టమ్స్ అధికారులకు ఈ హవాలాకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పూణే కస్టమ్స్ అధికారులు దుబాయ్ అధికారులను సంప్రదించారు.దుబాయ్ లో ల్యాండైన విద్యార్థులను పూణే కస్టమ్స్ అధికారుల విజ్ఞప్తి మేరకు దుబాయ్ అధికారులు వెనక్కి పంపించారు. పూణే చేరుకున్నాక విద్యార్థుల లగేజీ చెక్ చేయగా.. పుస్తకాల మధ్య దాచిన డాలర్ నోట్లు బయటపడ్డాయి. మొత్తం 4,00,100 డాలర్ల (మన కరెన్సీలో 3.5 కోట్లు) ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులను విచారించి ట్రావెల్ ఏజెంట్ ఖుష్బూ అగర్వాల్ ను, ఆమెకు డాలర్ నోట్లను సరఫరా చేసిన మహహ్మద్ ఆమిర్ ను అరెస్టు చేశారు. ముంబైలోని ఖష్బూ అగర్వాల్ ఫ్లాట్ లో సోదాలు జరపగా రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించిందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ డాలర్ నోట్లను దుబాయ్ చేర్చడానికే ఖుష్బూ అగర్వాల్ సదరు విద్యార్థులను మభ్యపెట్టి ట్రిప్ కు పంపించి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

  • Related Posts

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌