పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోకి ఆగంతకుడు

నేటి భారత్ న్యూస్ – హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నకిలీ ఉద్యోగి రాకపోకలు సాగించిన విషయం వెలుగులోకి వచ్చింది. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ను అంటూ దర్జాగా లోపలికి వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఏకంగా మూడుసార్లు రాకపోకలు సాగించడం భద్రతా వైఫల్యాన్ని బయటపెడుతోంది. తాను పోలీస్ డిపార్ట్ మెంట్ మనిషినని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నమ్మించేందుకు ఆగంతకుడు ఇలా కమాండ్ కంట్రోల్ సెంటర్ లోకి రాకపోకలు సాగించినట్లు సమాచారం. అత్యంత భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్ లోకి వెళ్లి వస్తుండడంతో అతడిని నమ్మి రూ.2.82 లక్షలు మోసపోయానని సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వాపోతున్నాడు.పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్ పల్లిలో నివాసం ఉంటున్న జ్ఞానసాయి ప్రసాద్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ హరిజన గోవర్ధన్ అంటూ జ్ఞానసాయి ప్రసాద్ తో పరిచయం పెంచుకున్నాడు. హోటల్ వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయని, భాగస్వామ్యంతో బిజినెస్ ప్రారంభిద్దామని నమ్మబలికాడు. తనపై నమ్మకం కలిగేందుకు మంగళవారం జ్ఞానసాయి ప్రసాద్ ను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్దకు తీసుకొచ్చాడు. దానికి ఎదురుగా ఉన్న నీలోఫర్ కేఫ్ లో కూర్చోబెట్టి బిజినెస్ గురించి మాట్లాడాడు.మధ్యమధ్యలో ఫోన్ మాట్లాడినట్లు నటించి కమాండ్ కంట్రోల్ సెంటర్ లోకి వెళ్లివచ్చాడు. ఒకటికి మూడుసార్లు ఇలా వెళ్లిరావడంతో జ్ఞానసాయి ప్రసాద్ కు అతడిపై నమ్మకం కుదిరింది. ఆపై పెట్టుబడిగా రూ.2.82 లక్షలు నిందితుడికి ఇచ్చాడు. అసలు విషయం తెలిశాక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, ఇటీవల తెలంగాణ సెక్రటేరియట్‌ లో నకిలీ ఉద్యోగులు పట్టుబడిన సంగతి తెలిసిందే.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌