

నేటి భారత్ న్యూస్- సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు ఊరట కల్పించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో, ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.