పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన కర్నూలు కోర్టు

నేటి భారత్ న్యూస్- ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి కర్నూలు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్, వారి కుటుంబ సభ్యులపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఇలాంటి కేసులోనే అరెస్టై గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని తమకు అప్పగించాలంటూ ఆదోని పోలీసులు జైలు సిబ్బందిని కోరారు. వారు అనుమతినివ్వడంతో పోసానిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం కర్నూలుకు తరలించారు. అక్కడ న్యాయమూర్తి ఎదుట పోసానిని ప్రవేశపెట్టారు. ఇరు పక్షాల వాదనల అనంతరం పోసానికి న్యాయమూర్తి ఈ నెల 18 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయనను కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు, నరసరావుపేటలో నమోదైన కేసులో పోసానికి కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదయ్యాయి.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్