

నేటి భారత్ న్యూస్- వైసీపీ చేపట్టిన యువత పోరు కార్యక్రమంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ఫీజు పోరు అని ముందుగా పేరు పెట్టి ఆ తర్వాత యువత పోరు అని మార్చడంపై ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసలు దేనిమీద పోరాడుతున్నారో కూడా వారికి క్లారిటీ లేదని అన్నారు. గతంలో రూ. 4,500 కోట్ల ఫీజులు బకాయి పెట్టారని… ఇప్పుడు వారే ధర్నా అంటున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలోనే కరెంట్ ఛార్జీలను పెంచారని… ఇప్పుడు మళ్లీ వాళ్లే ధర్నా అంటున్నారని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు తాము సిద్ధమని చెప్పారు. శాసనమండలిలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.