

నేటి భారత్ న్యూస్- కొంతమంది బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు. ఈరోజు తీన్మార్ మల్లన్న మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్ ఇచ్చారు. కులగణనపై అభ్యంతరాలు ఉండి ఉంటే శాసనమండలిలో మాట్లాడవచ్చని సూచించారు. బీఆర్ఎస్ చేయలేనిది తమ ప్రభుత్వం చేసినందుకు అభినందించాల్సింది పోయి విమర్శించడం సరికాదని ఆమె అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. కులగణనకు 50 రోజుల సమయం ఇచ్చామని తెలిపారు.