భారత్ దగ్గర బోల్డంత డబ్బుంది.. ఆ సాయం అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్

భారత్‌లో ఓటరు శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన రూ. 182 కోట్ల (21 మిలియన్ డాలర్లు) సాయాన్ని రద్దు చేయాలన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ (డీవోజీఈ) నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని, పన్నులు కూడా భారీగానే వసూలు చేస్తోందని, కాబట్టి దానికి (భారత్) ఆర్థికంగా ఎలాంటి సాయం అవసరం లేదని నొక్కి చెప్పారు.‘‘భారత్‌కు మేం 21 మిలియన్ డాలర్లు ఎందుకివ్వాలి? వారి వద్దే బోల్డంత డబ్బుంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు కలిగిన దేశం అదే. వారి టారిఫ్‌లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. భారత్ అన్నా, దాని ప్రధాని అన్నా నాకు చాలా గౌరవం. అయితే, ఓటింగ్‌ను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లు ఇచ్చే అవసరం మాత్రం లేదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేస్తున్నట్టు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘డోజ్’ ఈ నెల 16న ప్రకటించింది. అమెరికా ప్రజల పన్నుల ద్వారా వస్తున్న సొమ్మును ఇలాంటి వాటికి ఖర్చు చేయడం తగదని, కాబట్టి ఇకపై ఇలాంటి వాటన్నింటినీ రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. అమెరికా చేసిన ఈ ప్రకటన బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శలకు కారణమైంది. భారత ఎన్నికల్లో అమెరికా జోక్యానికి అవకాశం కల్పించారంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. 

  • Related Posts

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

    విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

     బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

    బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌