భారీ సంఖ్యలో చెట్ల నరికివేత ‘హత్య’తో సమానమేనన్న సుప్రీంకోర్టు

నేటి భారత్ న్యూస్- పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయడం మనిషిని చంపేయడానికి ఏమాత్రం తీసిపోని నేరమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తాజ్ ట్రాపెజియం జోన్ లో ఏకంగా 454 చెట్లను నరికివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మధురకు చెందిన దాల్మియా ఫార్మ్స్ కంపెనీ యాజమాన్యంపై తీవ్రంగా మండిపడింది. కొట్టేసిన చెట్ల స్థానంలో తిరిగి పచ్చదనం నెలకొల్పాలంటే కనీసం వందేళ్లు పడుతుందని పేర్కొంది. పర్యావరణానికి హాని కలిగించే వారి విషయంలో ఎలాంటి జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. చెట్ల నరికివేతకు పాల్పడిన దాల్మియా ఫార్మ్స్ యజమానికి భారీ మొత్తంలో జరిమానా విధించింది. నరికివేసిన 454 చెట్లకు సంబంధించి ఒక్కో చెట్టుకు రూ. లక్ష చొప్పున ఫైన్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతోపాటు తాజ్ ట్రాపెజియం జోన్ సమీపంలో మొక్కల పెంపకం చేపట్టాలని నిందితుడిని ఆదేశించింది. ఈ సందర్భంగా 2019లో ఇచ్చిన ఆదేశాలను కోర్టు గుర్తుచేసింది. తాజ్ ట్రాపెజియం జోన్ పరిధిలో అటవీ ప్రాంతం కానిచోట, ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోని భూముల్లో చెట్ల నరికివేతకు అనుమతి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని తన తీర్పులో ఉదహరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పు వెలువరించింది.

Related Posts

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

నేటి భారత్ న్యూస్- సాధారణంగా ఎక్స్ ప్రెస్ రైళ్లకు పాతిక, గూడ్సు రైళ్లకు 40 నుంచి 60 బోగీలు ఉంటాయి. కానీ ఈ రైలుకు ఏకంగా 295 బోగీలు ఉన్నాయి. వందల సంఖ్యలో బోగీలతో కూడిన ఈ రైలు ఎంత పొడవుందో…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

నేటి భారత్ న్యూస్- అనకాపల్లి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. దేవరాపల్లి గ్రామం వద్ద పొలాల్లో 15 అడుగుల కింగ్ కోబ్రా రైతులను భయభ్రాంతులకు గురిచేసింది. పొలాల్లోకి వచ్చిన ఆ భారీ విషసర్పాన్ని కుక్కలు నిలువరించాయి. దాంతో ఆ పాము…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

 తెనాలిలో స‌మంత‌కు గుడి క‌ట్టిన అభిమాని.

 తెనాలిలో స‌మంత‌కు గుడి క‌ట్టిన అభిమాని.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ర‌వీంద్ర‌ జ‌డేజా అరుదైన రికార్డ్‌.. తొలి ప్లేయ‌ర్‌గా ఘ‌న‌త‌!

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ర‌వీంద్ర‌ జ‌డేజా అరుదైన రికార్డ్‌.. తొలి ప్లేయ‌ర్‌గా ఘ‌న‌త‌!

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భానుడి ఉగ్రరూపం… ఐఎండీ అప్ డేట్

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భానుడి ఉగ్రరూపం… ఐఎండీ అప్ డేట్