మంద కృష్ణతో విభేదాలు లేవు, ఆయన నాకంటే మోదీని ఎక్కువగా నమ్ముతున్నారు: రేవంత్ రెడ్డి

నేటి భారత్ న్యూస్- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆయన తనకంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎక్కువగా విశ్వసిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం గట్టి వాదనలు వినిపించిందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో బలమైన వాదనలతో అత్యున్నత న్యాయస్థానాన్ని మెప్పించామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోట ఎస్సీ వర్గీకరణను అమలు చేయలేదని ఆయన విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎస్సీలకు న్యాయం చేయాలని బలంగా సంకల్పించానని, అందరితో సమన్వయం చేసుకుంటూ శాసనసభలో ఏకాభిప్రాయం సాధించామని ముఖ్యమంత్రి అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకించే సాహసం ఎవరూ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెట్టాలని 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో తాను చెప్పానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్రానికి తీర్మానం పంపించాలని కోరామని ఆయన అన్నారు. తీర్మానం ప్రవేశపెడితే తనతో పాటు సండ్ర వెంకటవీరయ్య, సంపత్‌లను సభ నుండి బహిష్కరించారని ఆయన తెలిపారు. తాము పెట్టిన తీర్మానాన్ని విధిలేని పరిస్థితుల్లో అప్పట్లో సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని ఆయన గుర్తు చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళతామని చెప్పి ఏనాడూ తీసుకువెళ్లలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్త్వరలో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. పిల్లలను కోచింగ్‌లకు సన్నద్ధం చేయాలని సూచించారు. పిల్లలను బాగా చదివించాలని, విదేశాలకు కూడా పంపించాలని ఆయన అన్నారు. ఎల్లప్పుడూ మన ఊర్లోనే, మన ఇళ్లలోనే ఉండకుండా విదేశాలకు వెళ్లాలని ఆయన సూచించారు.

Related Posts

 చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

నేటి భారత్ న్యూస్- పిఠాపురం నియోజకవర్గంలోన చిత్రాడలో మార్చి 14న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరగడం తెలిసిందే. జయకేతనం పేరిట నిర్వహించిన ఈ సభ విజయవంతంగా ముగిసిన సందర్భంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్…

రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట

నేటి భారత్ న్యూస్- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో రేవంత్ రెడ్డిపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

 చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట

రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట

బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగింది: సీఎం చంద్రబాబు

బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగింది: సీఎం చంద్రబాబు

 మంద కృష్ణతో విభేదాలు లేవు, ఆయన నాకంటే మోదీని ఎక్కువగా నమ్ముతున్నారు: రేవంత్ రెడ్డి

 మంద కృష్ణతో విభేదాలు లేవు, ఆయన నాకంటే మోదీని ఎక్కువగా నమ్ముతున్నారు: రేవంత్ రెడ్డి

ప్రగతి రథానికి పంక్చర్ వేశారు… తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్

ప్రగతి రథానికి పంక్చర్ వేశారు… తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్

కొత్త ఫోన్ ను మార్కెట్లోకి వదిలిన రియల్ మీ… బ్యాంక్ ఆఫర్లతో రూ.2 వేల డిస్కౌంట్!

కొత్త ఫోన్ ను మార్కెట్లోకి వదిలిన రియల్ మీ… బ్యాంక్ ఆఫర్లతో రూ.2 వేల డిస్కౌంట్!