

నేటి భారత్ న్యూస్- మయన్మార్, థాయ్‌లాండ్‌లను శుక్రవారం నాడు రెండు భారీ భూకంపాలు కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 1000 దాటిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఒక్క మయన్మార్‌లోనే 1002 మంది చనిపోయినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు తెలిపారు. మరో 2370 మందికి గాయాలైనట్లు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది రక్షించి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక బ్యాంకాక్‌లో 10 మంది మృతిచెందగా… ఓ భారీ భవనం కూలిన ఘటనలో సుమారు 100 మంది వరకు నిర్మాణ కార్మికులు గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ విపత్తు వల్ల మరణాలు 10వేలు దాటొచ్చని అమెరికా ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం. కాగా, పెను విలయంతో అతలాకుతలమైన మయన్మార్, థాయ్‌లాండ్‌లకు ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ఇప్పటికే భారత్ 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది.