మయన్మార్ భూకంపం.. వేగంగా స్పందించిన భారత్

నేటి భారత్ న్యూస్- పెను భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్ ను ఆదుకోవడంలో భారత ప్రభుత్వం తక్షణమే స్పందించింది. శుక్రవారం సంభవించిన భూకంపం కారణంగా మయన్మార్ లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి శనివారం ఉదయమే విమానం బయలుదేరి వెళ్లింది. భూకంప బాధితుల కోసం ఆహార పదార్థాలు, మందులు, దుప్పట్లు, తాత్కాలికంగా నివసించేందుకు టెంట్లు, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్స్, జెనరేటర్లను తీసుకువెళ్లింది.భారీ భవనాలు కూలిపోవడంతో గాయపడిన వారికి చికిత్స అందించడానికి అవసరమైన మందులను కూడా పంపించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విమానం శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మయన్మార్ లోని యాంగాన్ విమానాశ్రయంలో దిగిందని భారత దౌత్యవేత్త రణధీర్ జైశ్వాల్ ట్వీట్ చేశారు. మానవతా సహాయంగా ఈ విమానాన్ని పంపామని, అవసరాన్ని బట్టి మరింత సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు

Related Posts

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని…

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

నేటి భారత్ న్యూస్- హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుకాణదారుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!