మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో లైన్ పనులు.. నేటి నుంచి పలు రైళ్ల రద్దు

నేటి భారత్ న్యూస్- మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను నేటి నుంచి 13వ తేదీ వరకు రద్దు చేశారు. ఈ మేరకు ఖమ్మం రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ ఎండీ జాఫర్ తెలిపారు. గుంటూరు, కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య పలు రైళ్లు పాక్షికంగా రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించి సహకరించాలని కోరారు. దారి మళ్లించిన రైళ్లలో విశాఖ-న్యూఢిల్లీ, విశాఖ-గాంధీధామ్, హైదరాబాద్-షాలీమార్, ముంబై-భువనేశ్వర్, షిర్డీ-కాకినాడ, షిర్డీ-మచిలీపట్నం, ఎర్నాకుళం-బరౌనీ రైళ్లు ఉన్నాయి. అలాగే, రద్దయిన రైళ్లలో డోర్నకల్-విజయవాడ, విజయవాడ-భద్రాచలం రోడ్, గుంటూరు-సికింద్రాబాద్, విజయవాడ-సికింద్రాబాద్, తిరుపతి-సికింద్రాబాద్, ఇండోర్-కొచ్చివెల్లి, కోర్బా-తిరువనంతపురం, గోరఖ్‌పూర్-కొచ్చివెల్లి, హిస్సార్-తిరుపతి రైళ్లు ఉన్నాయి. గుంటూరు-సికింద్రాబాద్, సికింద్రాబాద్-గుంటూరు రైళ్లను రేపటి నుంచి ఈ నెల 13 వరకు రద్దు చేశారు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్