మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్, బాలకృష్ణ

నేటి భారత్ న్యూస్- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో మహిళల బలం, సహన శక్తి, భాగస్వామ్యాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం కీర్తిస్తుందని పేర్కొన్నారు. కుటుంబాలకే కాదు, ఎదుగుతున్న దేశానికి కూడా మహిళలు వెన్నెముక వంటి వారని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ఆమె గొప్పదనాన్ని గుర్తిద్దాం. ఆమెకు మద్దతుగా నిలబడదాం, ఆమె కలలకు చేయూతనిద్దాం. మన చర్యల ద్వారా ఆమెకు నిజమైన గౌరవాన్ని అందిద్దాం అని పిలుపునిచ్చారు. మరింత మెరుగైన ప్రపంచాన్ని మనకు అందిస్తున్నందుకు మహిళను గౌరవిద్దాం.మరింత ఎత్తుకు తీసుకెళదాం. ఇవాళ  ఒక్కరోజే కాదు. ప్రతి రోజూ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.స్త్రీ స్వభావమే ఆది మాతృత్వం: బాలకృష్ణయత్రనార్యస్తు పూజ్యంతే. రమంతే తత్ర దేవతాః అని మన సంస్కృతి మనకు చెబుతుందని. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని దీని అర్థం అని నందమూరి బాలకృష్ణ వివరించారు. స్త్రీ స్వభావమే ఆది మాతృత్వం అని అభివర్ణించారు. కుటుంబాన్ని కాపాడే బలం, సమాజంలో వెలుగులు నింపే శక్తి, భవిష్యత్ పల్లవించే ప్రేమ మహిళల గొప్పదనం అని పేర్కొన్నారు. “మహిళలు అమ్మగా, చెల్లిగా, భార్యగా, కూతురిగా ప్రతి రూపంలోనూ త్యాగానికి, ఓర్పుకు, ప్రేమకు మారుపేరుగా నిలుస్తారు. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి మహిళా స్ఫూర్తిదాయకమే. వారిని గౌరవించుకోవడం మన విధి. వారిని కాపాడుకోవడం మన బాధ్యత. ఆదరణ, అంకితభావం, అజేయ సంకల్పం గల మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ బాలకృష్ణ సోషల్ మీడియాలో స్పందించారు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్