మాటలు జాగ్రత్త.. కేంద్ర మంత్రిపై తమిళనాడు సీఎం ఆగ్రహం

నేటి భారత్ న్యూస్- కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. ‘మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. తమిళులను, తమిళ భాషను అవమానిస్తే సహించబోమంటూ ట్వీట్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ తనను తాను రాజులా భావించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగరుగా మాట్లాడుతున్నారని, ఆయనకు క్రమశిక్షణ అవసరమని అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) పేరుతో హిందీని తమిళులపై రుద్దాలన్న ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. ఎన్ఈపీని తమిళనాడులో అమలు చేయబోమని తేల్చిచెప్పారు. లోక్ సభలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమిళులను అవమానించారని మండిపడ్డారు. కాగా, లోక్ సభలో డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు తనను బాధించాయని అన్నారు. ఎన్ఈపీ పాలసీపై మొదటి నుంచి డీఎంకే ఒకేమాటపై ఉందని, ఎన్ఈపీకి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. డీఎంకే సభ్యులను కించపరచాలనేది తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే, ఈ వివాదం అక్కడితో సమసిపోలేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై ఎంపీ కనిమొళి స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ అందించారు. లోక్ సభలో ఏం జరిగిందంటే.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) కి తమిళనాడు వ్యతిరేకమని, తమపై హిందీని రుద్దవద్దని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీలు సోమవారం సభలో నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన తెలిపారు. అయితే, ఎంపీల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. డీఎంకే ఎంపీలు అనాగరికులని, నిజాయతీ లేనివారని తమిళ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ఈపీ పాలసీని తీసుకొచ్చినపుడు తొలుత అంగీకారం తెలిపింది తమిళనాడు ప్రభుత్వమేనని, ఇప్పుడు వారు మాటమారుస్తున్నారని మంత్రి ఆరోపించారు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్