

నేటి భారత్ – ఏపీ శాసనమండలిలో మిర్చి రైతుల అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. మిర్చి రైతుల గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు మిర్చి యార్డులో అవినీతి జరిగిందని ఆరోపించారు.మిర్చి రైతుల సమస్యలను సీఎం చంద్రబాబుకు వివరించామని… ఆయన మిర్చి ధరలపై ఎగుమతిదారులు, రైతులతో చర్చించారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులకు లబ్ధి చేకూరేలా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ చంద్రబాబు చర్చించారని తెలిపారు.