మీకెవరూ సాటిలేరు.. సునీత రాకపై మెగాస్టార్ చిరంజీవి

నేటి భారత్ న్యూస్- సునీతా విలియమ్స్ గొప్ప ధైర్యవంతురాలని, ఆమెకు సాటి ఎవరూ లేరని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. రోదసిలో 9 నెలలు గడిపిన అనంతరం సునీత, బుచ్ విల్మోర్ సహా నలుగురు వ్యోమగాములు ఈ తెల్లవారుజామున భూమిని చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌కు స్వాగతం చెప్పిన చిరంజీవి.. ఇది చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. 8 రోజుల్లో తిరిగి వస్తామని  వెళ్లి 286 రోజుల తర్వాత భూమిని చేరుకున్నారన్నారు. ఆశ్చర్యకరంగా భూమి చుట్టూ 4,577 సార్లు తిరిగారని గుర్తు చేశారు. మీరు గొప్ప ధైర్యవంతులని, మీకు ఎవరూ సాటిరారని ప్రశంసించారు. సునీత ప్రయాణం ఒక అడ్వెంచర్ మూవీని తలపిస్తోందని, ఇదొక గొప్ప సాహసమని, నిజమైన బ్లాక్ బస్టర్ అని చిరు రాసుకొచ్చారు.

Related Posts

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

నేటి భారత్ న్యూస్- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమైన విషయం విదితమే. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అటు నియోజకవర్గానికి కానీ, ఇటు అసెంబ్లీకి కానీ వెళ్లడంలేదు. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల…

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

నేటి భారత్ న్యూస్త– మిళనాడులోని తిరువణ్ణామలై కొండపై ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫ్రాన్స్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ గత జనవరిలో తిరువణ్ణామలైను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

 గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

 గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

భారత్ లో కాలు మోపుతున్న ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ

భారత్ లో కాలు మోపుతున్న ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ