

నేటి భారత్ న్యూస్- మెగా కోడలు, రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ఇంట్లో జరిగే స్పెషల్ ఈవెంట్స్, ఇతర వాటిని ఆమె ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్టు పెట్టారు. ఈ నెల 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 40వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సంద్భంగా మెగా ఫ్యామిలీతో పాటు సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా చెర్రీకి విషెస్ తెలియజేశారు. అలాగే కొంతమంది సినిమా వాళ్లు ప్రత్యేకంగా రామ్ చరణ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అటు కొంతమంది అభిమానులు రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉపాసన తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా షేర్ చేశారు. “మార్చి 27ను ఇంత ప్రత్యేకమైన రోజుగా మార్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు” అంటూ ఎమోషనల్ ఎమోజీలతో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.