యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- రాష్ట్రంలోని యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా కూట‌మి ప్ర‌భుత్వ‌ చ‌ర్య‌లు ఉంటాయ‌ని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈరోజు అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల్లో భాగంగా ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యంలో అక్ర‌మాల‌పై చ‌ర్చ జ‌రిగింది. వైసీపీ హ‌యాంలో అనేక అక్ర‌మాలు జ‌రిగాయ‌ని టీడీపీ ఎమ్మెల్యేలు ప‌ల్లా శ్రీనివాస్‌, గ‌ణ‌బాబు, వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబు, జ‌న‌సేన ఎమ్మెల్యే కొణ‌తాల రామ‌కృష్ణ స‌భ దృష్టికి తీసుకొచ్చారు.  ఈ అంశంపై మంత్రి లోకేశ్ మాట్లాడుతూ. ఆంధ్రా యూనివ‌ర్సిటీలో అక్ర‌మాల‌పై విజిలెన్స్ విచార‌ణ జ‌రిపిస్తామ‌ని అన్నారు. ఇన్‌ఛార్జ్ వీసీ ఇప్ప‌టికే విచార‌ణ‌కు ఆదేశించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. ఆ విచార‌ణ నివేదిక అందిన వెంట‌నే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.  ఎమ్మెల్యే గ‌ణ‌బాబు మాట్లాడుతూ.. గ‌తంలో ఏయూ వీసీగా ప‌నిచేసిన ప్ర‌సాద‌రెడ్డి వైసీపీ అధ్య‌క్షుడి త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించార‌ని మండిప‌డ్డారు. ఎంతో పేరున్న ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యాన్ని రాజ‌కీయ వేదిక‌గా ఆయ‌న మార్చేశార‌ని ఆరోపించారు. ఏపీలోని ఇత‌ర వ‌ర్సిటీల ప్ర‌క్షాళ‌న కూడా జ‌ర‌గాల‌ని ఎమ్మెల్యే కొణ‌తాల రామ‌కృష్ణ కోరారు. ఏయూ విష‌యంలో నిర్దిష్ట కాలంలో విచార‌ణ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబు పేర్కొన్నారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌