

నేటి భారత్ – ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. మరోవైపు రష్యాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. రష్యాపై ఇప్పుడు ఆయన మరింత ప్రేమను చూపిస్తున్నారు. రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాపై ఆంక్షలను ఎత్తివేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలను వెలువరించింది.రష్యాకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులకు ఉపశమనం కల్పించే దిశగా ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని విదేశీ వ్యవహారాలు, ట్రెజరీ శాఖలను వైట్ హౌస్ కోరినట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. దీనిపై రష్యన్ ప్రతినిధులతో అమెరికా అధికారులు చర్చలు జరిపేందుకు సన్నాహకాలు చేస్తున్నట్టు సమాచారం.