నేటి భారత్ న్యూస్- రేవంత్ రెడ్డి వంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ రేవంత్ రెడ్డి నిన్న ఆరోపణలు చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టును కేంద్ర కేబినెట్ వద్దకు వెళ్లకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు.ఈ ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు. తాను ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్లు రేవంత్ రెడ్డి నిరూపించాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధానాలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుండి నిధులు తెచ్చి తెలంగాణను అభివృద్ధి చేస్తానని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారా? అని ప్రశ్నించారు.