వడగళ్ల వానతో పంట నష్టం…. ఆరాతీసిన సీఎం చంద్రబాబు

నేటి భారత్ న్యూస్- అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంట నష్టపోయి తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లిలో జరిగిన ఈ సంఘటనపై ఆయన జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా, ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. మరింత మెరుగైన చికిత్స కోసం వారిని అనంతపురం తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా జరిగిన పంట నష్టంపై సమగ్ర సమీక్ష జరిపారు. కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లోని 40 గ్రామాలలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు నివేదించారు. దాదాపు 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వారు వివరించారు. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రైతులు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Related Posts

రేవంత్ రెడ్డి అప్పుడు, ఇప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై ఏడుస్తున్నారు: హరీశ్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై విమర్శలు చేశారని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ శాసనసభకు హాజరుకాకపోవడం వల్ల నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కావడం లేదని గజ్వేల్…

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

నేటి భారత్ న్యూస్-‘‘మూడేళ్ల తర్వాత అధికారం మనదే. అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా, అప్పటి వరకు ధైర్యంగా ఉండు’’ అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్‌కు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

రేవంత్ రెడ్డి అప్పుడు, ఇప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై ఏడుస్తున్నారు: హరీశ్ రావు

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేశ్

రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేశ్

నేపాల్‌లో వివాహ వయసు 20 నుంచి 18కి తగ్గింపు!

నేపాల్‌లో వివాహ వయసు 20 నుంచి 18కి తగ్గింపు!

మ‌హేంద్రుడా మ‌జాకా… వింటేజ్ ధోనీని గుర్తు చేశాడుగా..

మ‌హేంద్రుడా మ‌జాకా… వింటేజ్ ధోనీని గుర్తు చేశాడుగా..

 నేడు ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశవర్కర్ల పిలుపు .. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు

 నేడు ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశవర్కర్ల పిలుపు .. ఎక్కడికక్కడ నేతల అరెస్టులు