వర్షం కారణంగా ఆస్ట్రేలియా -సౌతాఫ్రికా మ్యాచ్ రద్దు.. గ్రూప్-బీలో అన్ని జట్లకు సెమీస్ చాన్స్!

నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బీలో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య నిన్న రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించడంతో రెండు జట్లు మూడేసి పాయింట్లతో గ్రూప్-బీలో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. అయితే, మెరుగైన రన్‌రేట్ కారణంగా సఫారీ జట్టు టాప్ ప్లేస్‌లో ఉంది. ఓటమి పాలైన ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయినప్పటికీ అన్ని జట్లకు సెమీస్ అవకాశాలున్నాయి. ముఖ్యంగా పాయింట్ల ఖాతా తెరవని ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు కూడా ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి.దక్షిణాఫ్రికా మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ మార్చి 1న బలమైన ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. అప్పుడు గెలిస్తే కనుక 5 పాయింట్లతో సెమీస్‌కు చేరుతుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి వైదొలగుతుంది. అదే సమయంలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడుతుంది. ఇందులో ఎలాంటి సంచలనాలు నమోదు కాకుండా, ఆస్ట్రేలియా విజయం సాధిస్తే కనుక 5 పాయింట్లతో సెమీస్‌కు వెళుతుంది. లేదంటే సెమీస్ ఆశలు గల్లంతవుతాయి.మరోవైపు, ఆఫ్ఘనిస్థాన్‌తో నేడు జరగనున్న మ్యాచ్‌తోపాటు మార్చి 1న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ విజయం సాధిస్తే కనుక 4 పాయింట్లతో సెమీస్‌ చేరుకుంటుంది. ఒక్కదాంట్లో ఓడినా ఇంటి ముఖం పట్టక తప్పదు. ఇంకోవైపు, ఆఫ్ఘనిస్థాన్‌కు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు ఉన్నాయి. ఇకపై ఆడే రెండు మ్యాచుల్లోనూ సంచలనాలు నమోదు చేసి, విజయం సాధిస్తే కనుక సెమీస్‌కు చేరుకుంటుంది. అయితే, ఇకపై ఢీకొట్టే రెండు జట్లు బలమైనవే కావడంతో ఎంతవరకు అది పోటీనిస్తుందనేది చూడాలి. ఇక, గ్రూప్-ఏలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచిన న్యూజిలాండ్, భారత జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. మెరుగైన రన్‌రేట్ కారణంగా కివీస్ టాప్ ప్లేస్‌లో ఉంది.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌