

నేటి భారత్ – గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను పోలీసులకు విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు అందజేసింది. కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి సత్యవర్ధన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా సత్యవర్ధన్ స్టేట్మెంట్ కావాలని కోరుతూ పోలీసులు కోర్టును కోరారు. వారి విన్నపం మేరకు కోర్టు స్టేట్మెంట్ ను అందజేసింది. మరోవైపు, ఈ కేసులో ఏ4 వీర్రాజు, ఏ10 వంశీ బాబులను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనను వేరే బ్యారక్ కు మార్చాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈరోజు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.