

నేటి భారత్ – దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర దిగ్గజ కంపెనీల్లో అమ్మకాలు మార్కెట్లను నష్టాల్లోకి నడిపించాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 112 పాయింట్లు నష్టపోయి 73,085 వద్ద ముగిసింది. నిఫ్టీ 5 పాయింట్లు కోల్పోయి 22,119 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (2.21%), భారతి ఎయిర్ టెల్ (1.76%), ఇన్ఫోసిస్ (1.19%), ఎన్టీపీసీ (1.14%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.06%).
టాప్ లూజర్స్:
రిలయన్స్ (-2.38%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.86%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.72%), అదానీ పోర్ట్స్ (-1.63%), మారుతి (-1.48%).