విమర్శల నుంచి తప్పించుకోలేకపోతున్న ‘కన్నప్ప’

నేటి భారత్ న్యూస్- ‘కన్నప్ప’గా ప్రేక్షకుల ముందుకు రావడానికి మంచు విష్ణు రెడీ అవుతున్నాడు. వచ్చే నెల 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. ‘కన్నప్ప’ చరిత్రను ఫారిన్ లొకేషన్స్ లో చిత్రికరించడమనేది మొదటి నుంచి కూడా చర్చనీయాంశమైంది. ఒక కోయగూడానికి చెందిన మొరటు వ్యక్తిని యుద్ధ వీరుడిగా చూపించడం .. శివుడికి మీసాలు లేకపోవడం .. ప్రభాస్ లుక్ అయోమయంగా అనిపించడం చాలామందికి అసంతృప్తిని కలిగించింది. ఈ నేపథ్యంలో వదిలిన ‘శివశివశంకర .. ‘ పాటలో, కన్నప్ప తనకి అందుబాటులో ఎలాంటి పాత్ర లేకపోవడం వలన నోట్లో నీళ్లు పోసుకుని శివలింగాన్ని అభిషేకిస్తాడు. ఆ తరువాత షాట్ లోనే మట్టిపాత్రలో దుప్పి మాంసం నైవేద్యం పెట్టినట్టు చూపించడం విస్మయం కలిగించింది. ఇక రీసెంటుగా ‘కన్నప్ప’ నుంచి ‘సగమై చెరిసగమై’ అంటూ సాగే మరో లిరికల్ సాంగ్ ను వదిలారు. మొదటి పాట మాదిరిగానే ఈ పాట కూడా విమర్శల నుంచి తప్పించుకోలేకపోయింది. ” కోయగూడానికి చెందిన భార్యాభర్తలు ఆ యాసలోనే పాటలు పాడుకుంటారు .. గతంలో వచ్చిన ‘భక్త కన్నప్ప’లోని పాటలు ఇప్పటికీ నిలిచిపోవడానికి కారణం ఆ సహజత్వమే. కానీ ఈ పాటలో కన్నప్ప పాత్రకి ‘ఇరు పెదవుల శబ్దం .. విరి ముద్దుల యుద్ధం’ అనే ప్రయోగం చేశారు. ఇది ఒక సాధారణ యువతీ యువకులు పాడుకునే పాట మాదిరిగానే ఉందిగానీ, కోయగూడానికి చెందిన ఆలుమగలు పాడుకునే పాటలా లేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.  ఇక ఈ పాటలో హీరోయిన్ పెదవులపై కన్నప్ప ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేయడం కొసమెరుపు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్