వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలు మిస్టరీగా మాత్రం మిగిలిపోవు: ఏపీ హోం మంత్రి అనిత

నేటి భారత్ న్యూస్-వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న మృతి చెందడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ హోం మంత్రి అనిత స్పందిస్తూ. సాక్షుల మరణాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చించామని. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామని చెప్పారు. వివేకా హత్య కేసులో ఎవరి మరణాలు అయినా మిస్టరీగా మాత్రం మిగిలిపోవని అన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని చెప్పారు. రంగన్న పోస్ట్ మార్టం తర్వాత అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. మరోవైపు కేబినెట్ మీటింగ్ లో రంగన్న మృతిపై చర్చ జరిగింది. వివేకా హత్య కేసులో సాక్షులు చనిపోవడంపై మంత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరిటాల రవి హత్య కేసులో కూడా సాక్షులు ఇలాగే చనిపోయరని సీఎం చంద్రబాబుకు చెప్పారు. రంగన్న మృతి కూడా అనుమానాస్పదంగా ఉందని తెలిపారు. దీనిపై డీజీపీ హరికుమార్ గుప్తా వివరణ కోరగా. మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. మరణాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డీజీపీని కేబినెట్ ఆదేశించింది.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్