విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

నేటి భారత్ న్యూస్- విశాఖపట్నంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయాలు ప్రారంభమైన నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో టికెట్ల కోసం ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. విశాఖలో ఈ నెల 24న ఢిల్లీ-లక్నో, 30న ఢిల్లీ-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. ఢిల్లీ-లక్నో మ్యాచ్ టికెట్ల విక్రయాలు నిన్న సాయంత్రం 4 గంటలకు డిస్ట్రిక్ట్ (జొమాటో) యాప్‌లో ప్రారంభమయ్యాయి. అప్పటికే టికెట్ల కోసం వేలాదిమంది అభిమానులు ఆన్‌లైన్‌లో వేచి చూస్తుండటంతో సేల్ ప్రారంభమైన నిమిషాల్లోనే రూ. 1000 టికెట్లు నిండుకున్నాయి. ఢిల్లీ-హైదరాబాద్ మ్యాచ్ టికెట్లు ఎప్పుడు విక్రయిస్తారన్న విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. కాగా, గతేడాది మార్చి 31న జరిగిన ఢిల్లీ-చెన్నై మ్యచ్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. గతంలో నకిలీ టికెట్ల విక్రయాలు జోరుగా సాగాయని, ప్రస్తుతం అలాంటి ఘటనలు ఎవరి దృష్టికైనా వస్తే పోలీసులకు తెలియజేయాలని, లేదంటే తన వ్యక్తిగత వాట్సాప్ నంబర్ 79950 95799కు ఫిర్యాదులు పంపాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చీ తెలిపారు.

Related Posts

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

నేటి భారత్ న్యూస్- ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన ‘కోర్ట్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తొలి షోతోనే ఈ చిత్రం హిట్ టాక్ ను సంపాదించుకుంది. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని…

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

నేటి భారత్ న్యూస్- తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సెషన్ మొత్తానికి ఆయనను సస్పెండ్ చేశారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

 ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని

 ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని

ఏనాడైనా ప్రజల్లో తిరిగారా..? జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

ఏనాడైనా ప్రజల్లో తిరిగారా..? జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

పారిశుద్ధ్య కార్మికుల‌తో సీఎం చంద్ర‌బాబు ముఖాముఖి

పారిశుద్ధ్య కార్మికుల‌తో సీఎం చంద్ర‌బాబు ముఖాముఖి

 విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

 విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు