వైట్ హౌస్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు… విందు నచ్చకపోతే ఫిర్యాదు చేయొద్దన్న ట్రంప్

నేటి భారత్ న్యూస్- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికలలో మద్దతు తెలిపిన అమెరికన్ ముస్లింలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, మధ్యప్రాచ్యంలో శాంతి కోసం తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఈ విందులో ట్రంప్ మాట్లాడుతూ, 2024 అధ్యక్ష ఎన్నికలలో రికార్డు స్థాయిలో మద్దతు తెలిపిన అమెరికన్ ముస్లింలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారం ప్రారంభంలో ముస్లింల మద్దతో ఓ మోస్తరుగానే ఉన్నప్పటికీ, నవంబర్‌లో ఎన్నికల నాటికి ముస్లింలు తనకు అండగా నిలిచారని వివరించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ముస్లిం సమాజానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి, ప్రార్థనలపై దృష్టి పెడతారని ట్రంప్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ప్రతిరోజూ కుటుంబాలు మరియు స్నేహితులతో కలిసి అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇఫ్తార్ విందుతో ఉపవాసం విరమిస్తారని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి కోసం తామంతా ఎదురు చూస్తున్నామని స్పష్టం చేశారు. ఇక, తాను ఇచ్చి ఈ ఇఫ్తార్ ఈ విందు మీకు నచ్చుతుందని ఆశిస్తున్నానని, నచ్చకపోతే ఫిర్యాదు చేయవద్దని సరదాగా అన్నారు. 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో, మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడానికి తన ప్రభుత్వం చేస్తున్న దౌత్యపరమైన ప్రయత్నాలను ట్రంప్ ప్రస్తావించారు. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో జనవరిలో జరిగిన కాల్పుల విరమణ మార్చి 18న ముగిసిన తర్వాత పోరాటం మళ్లీ ప్రారంభమైంది. ప్రతి ఒక్కరికీ ఆశాజనకమైన భవిష్యత్తును సృష్టించడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. “మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి వైట్ హౌస్‌లో ఉన్నాడు” అని ట్రంప్ ఉద్ఘాటించారు.

Related Posts

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని…

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

నేటి భారత్ న్యూస్- హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుకాణదారుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!