శ్రీరామనవమికి ఒక రోజు ముందుగానే… ఈరోజు భద్రాచలంకు వెళుతున్న పవన్ కల్యాణ్

నేటి భారత్ న్యూస్- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు భద్రాచలంకు వెళుతున్నారు. రేపు భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. పండుగరోజుకు ఒక్క రోజు ముందుగానే పవన్ భద్రాచలంకు వెళుతున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను సీతారాముల కళ్యాణానికి పవన్ సమర్పించనున్నారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో ఆయన భద్రాచలంకు బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు ఆయన భద్రాచలం చేరుకుంటారు. ఈ రాత్రికి భద్రాచలంలోనే ఆయన బస చేస్తారు. రేపు సీతారాముల కళ్యాణానికి పవన్ హాజరవుతారు. ఈ సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. రేపు సాయంత్రం 5 గంటలకు భద్రాచలం నుంచి తిరుగుపయనమవుతారు. రేపు రాత్రి 10 గంటలకు హైదరాబాద్ లోని నివాసానికి చేరుకుంటారు. మరోవైపు, రేపు స్వామివారి కళ్యాణానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు భద్రాచలం వెళ్లనున్నారు.

Related Posts

జగ్జీవన్ రామ్ సేవలు మహోన్నతమైనవి: కేసీఆర్

నేటి భారత్ న్యూస్- బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరమోధుడిగా, ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమ సమాజ దార్శనికుడిగా జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు…

 రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా కంచ గచ్చిబౌలి అడవిని ధ్వంసం చేస్తున్నారు: కేటీఆర్

నేటి భారత్ న్యూస్- కంచ గచ్చిబౌలిలోని చిట్టడవిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత నిర్దయగా ధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దీనివల్ల విలువైన వృక్ష, జంతుజాలం నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ అడవులను ధ్వంసం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

జగ్జీవన్ రామ్ సేవలు మహోన్నతమైనవి: కేసీఆర్

జగ్జీవన్ రామ్ సేవలు మహోన్నతమైనవి: కేసీఆర్

గ‌చ్చిబౌలి భూముల‌పై పోలీసుల కీల‌క ఆదేశాలు

గ‌చ్చిబౌలి భూముల‌పై పోలీసుల కీల‌క ఆదేశాలు

 రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా కంచ గచ్చిబౌలి అడవిని ధ్వంసం చేస్తున్నారు: కేటీఆర్

 రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా కంచ గచ్చిబౌలి అడవిని ధ్వంసం చేస్తున్నారు: కేటీఆర్

హౌతీలను అమెరికా బలగాలు ఎలా హతమార్చాయో వీడియో విడుదల చేసిన ట్రంప్.

హౌతీలను అమెరికా బలగాలు ఎలా హతమార్చాయో వీడియో విడుదల చేసిన ట్రంప్.

 సరికొత్త కలర్ ఆప్షన్లతో మూడు వేరియంట్లలో హోండా సీబీ 350

 సరికొత్త కలర్ ఆప్షన్లతో మూడు వేరియంట్లలో హోండా సీబీ 350

 ‘అదుర్స్-2’ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

 ‘అదుర్స్-2’ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు