సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని..

నేటి భారత్ న్యూస్- సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కేటుగాళ్లు యువకులను మోసం చేసి డబ్బులు దండుకుంటున్న సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. కన్సల్టెన్సీల పేరుతో నిరుద్యోగ యువతను మోసగిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఎ. సాయికుమార్ అనే బీటెక్ పూర్తి చేసిన యువకుడు ఓ కన్సల్టెన్సీ వ్యక్తికి రూ.2.25 లక్షలు చెల్లించి మోసపోయాడు. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని వెంగళరావునగర్ కాలనీలో హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న సాయికుమార్‌కు కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తానని జానీ అనే యువకుడు నమ్మబలికాడు. అమర్‌నాథ్ అనే కన్సల్టెంట్‌కు డబ్బులు ఇప్పించాడు. డబ్బులు చెల్లించిన మూడు నెలలకు ఓ కంపెనీ పేరుతో జూమ్ కాల్ ఇంటర్వ్యూ నిర్వహించి, ఆ కంపెనీ పేరుతోనే ఆఫర్ లెటర్ సాయికుమార్‌కు పంపించాడు అమర్‌నాథ్. అయితే, ఆ కంపెనీ గురించి సాయికుమార్ ఆన్‌లైన్‌లో వెతకగా ఎక్కడా వివరాలు తెలియరాలేదు. దీంతో అనుమానం వచ్చి అమర్‌నాథ్‌ను సాయికుమార్ నిలదీయగా, అప్పటి నుంచి అతడు ఫోన్ ఎత్తడం మానేశాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన సాయికుమార్ మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్