

నేటి భారత్ న్యూస్- ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడంతో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్న అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి అసెంబ్లీకి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 11 గంటలకు అసెంబ్లీకి చేరుకుని… అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న శంకర్ నాయక్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా విషెస్ తెలపడం విశేషం. ఈ ఉదయం అసెంబ్లీలో సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి… అక్కడే ఉన్న శంకర్ నాయక్ కు శుభాకాంక్షలు తెలిపారు.