సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్లు.

నేటి భారత్ న్యూస్- సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భూమికి చేరుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్‌కు డాల్ఫిన్లు స్వాగతం పలికాయి. సునీత, విల్మోర్‌, మరో ఇద్దరు వ్యోమగాములు నిక్ హాగ్, రోస్‌కోమోస్ కాస్మోనాట్ అలెక్సాండర్ గోర్బనోవ్‌తో కూడిన క్రూ డ్రాగన్ క్యాప్సుల్ ఈ తెల్లవారుజామున ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయింది. ఆ వెంటనే వారికి స్వాగతం పలుకుతున్నట్టుగా క్యాప్సుల్ చుట్టూ డాల్ఫిన్లు ఈదడం కనిపించింది. సముద్రంలో ల్యాండైన క్యాప్సుల్‌ను బోట్‌లోకి ఎక్కించేందుకు నాసా సిబ్బంది ప్రయత్నిస్తున్న సమయంలో డాల్ఫిన్లు దాని చుట్టూ చేరాయి. కాగా, క్యాప్సుల్ నుంచి వ్యోమగాములను బయటకు తీసిన సిబ్బంది అనంతరం వారిని హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారిని 45 రోజులపాటు పునరావాసంలో ఉంచుతారు.  

Related Posts

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

నేటి భారత్ న్యూస్- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమైన విషయం విదితమే. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అటు నియోజకవర్గానికి కానీ, ఇటు అసెంబ్లీకి కానీ వెళ్లడంలేదు. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల…

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

నేటి భారత్ న్యూస్త– మిళనాడులోని తిరువణ్ణామలై కొండపై ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫ్రాన్స్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ గత జనవరిలో తిరువణ్ణామలైను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

 గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

 గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

భారత్ లో కాలు మోపుతున్న ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ

భారత్ లో కాలు మోపుతున్న ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ