‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ రెండో పాట వ‌చ్చేసింది.. ఈ సాంగ్‌ ఫ్యాన్స్ మనసులు ‘కొల్లగొట్ట‌డం’ ప‌క్కా!

నేటి భారత్ న్యూస్- ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా క్రిష్ జాగ‌ర్ల‌మూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెర‌కెక్కిస్తోన్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ఒక సాంగ్ రిలీజ్ చేయగా ఈరోజు రెండో పాటను విడుదల చేశారు. ‘కొల్ల‌గొట్టినాదిరో’ అంటూ సాగే పాట‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. కోర కోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో… అంటూ వీరమల్లుని పొగుడుతూ సాగింది ఈ పాట‌. మంచి మాస్ బీట్ తో సాంగ్ అదిరిపోయింది. ఆస్కార్ అవార్డు గ్రహీత‌, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీరవాణి అందించిన బాణీలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల ఈ పాటను ఆలపించారు.  ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ.దయాకర్ రావు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు. పవన్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి లాంటి బాలీవుడ్‌ స్టార్స్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. కాగా, ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి అత్యధిక భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన విష‌యం తెలిసిందే. ఇంకా చిత్రీకరణ మిగిలుండగానే క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నారు. దాంతో ఆయన స్థానంలో ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం మార్చి 28న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సంద‌డి చేయ‌నుంది.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌