హెల్మెట్‌ను విసిరికొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి.. నెట్టింట‌ వీడియో వైర‌ల్‌!

నేటి భారత్ న్యూస్- ఉప్ప‌ల్ వేదిక‌గా నిన్న రాత్రి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు రాణించ‌లేక‌పోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ సీజ‌న్‌లో తొలి ఓట‌మిని చ‌విచూసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 190 ప‌రుగులు చేయ‌గా… 191 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఎల్ఎస్‌జీ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజ‌యంతో ల‌క్నో పాయింట్ల ఖాతా తెరిచింది. అయితే, స‌న్‌రైజ‌ర్స్ తెలుగు ఆట‌గాడు నితీశ్ కుమార్ రెడ్డి ఔటైన త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ చేసిన ప‌ని తాలూకు వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించి నితీశ్ కుమార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 28 బంతులాడి 32 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఈ క్ర‌మంలో ఔటైన త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ హెల్మెట్‌ను ఆగ్ర‌హంగా మెట్ల‌పైకి విసిరికొట్టాడు. దానికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

Related Posts

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని…

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

నేటి భారత్ న్యూస్- హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుకాణదారుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!