హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

నేటి భారత్ న్యూస్- హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుకాణదారుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఒక దుకాణదారుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో ఎక్స్‌పోకు వచ్చిన సందర్శకులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపిన దుకాణదారుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.  ఆనం మీర్జా… ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి. రంజాన్ సీజన్ నేపథ్యంలో ఆమె తన పేరిట ఎక్స్ పో ఏర్పాటు చేసినట్టు  తెలుస్తోంది.

Related Posts

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

నేటి భారత్ న్యూస్- ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని…

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

నేటి భారత్ న్యూస్- మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ అర్ధాంగి ఉపాస‌న కొణిదెల‌ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటార‌నే విష‌యం తెలిసిందే. ఇంట్లో జ‌రిగే స్పెష‌ల్ ఈవెంట్స్, ఇత‌ర వాటిని ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌తో పంచుకుంటుంటారు. తాజాగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!