హైదరాబాద్ ఎయిర్ పోర్టులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

నేటి భారత్ న్యూస్- ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన పైలట్ అప్రమత్తత కారణంగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..గోవా నుంచి 150 మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్ లైన్స్ 6 ఈ 6973 విమాన సర్వీసు శంషాబాద్ మీదుగా విశాఖకు బయలుదేరింది. ఈ క్రమంలో ఈ విమానానికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించడంతో పైలట్ విమానం హైడ్రాలిక్ గేర్‌ను సిద్ధం చేశాడు. విమాన సర్వీసును డౌన్ చేసిన పైలట్.. అప్పటికే రన్ వేపై టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని గమనించి అప్రమత్తమయ్యాడు. వెంటనే తన విమానాన్ని టేకాఫ్ చేసి, పెను ప్రమాదం తప్పింది. పది నిమిషాల సేపు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. దీంతో అటు అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ విమాన సర్వీస్ విశాఖకు వెళ్లిపోయింది. అయితే.. రన్ వేపై టేకాఫ్ తీసుకోవడానికి ఒక విమానం ఉండగా, మరో విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి ఇవ్వడాన్ని ప్రయాణికులు తప్పుబడుతున్నారు. ఏది ఏమైనా పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పడంతో అతన్ని అభినందిస్తున్నారు.

Related Posts

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బీఆర్ఎస్ నుండి ఒకరు, సీపీఐ నుండి…

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

నేటి భారత్ న్యూస్- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్