రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు .. ఎందుకంటే..?

నేటి భారత్ న్యూస్-ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (మంగళవారం) ఢిల్లీ వెళుతున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణాలకు ప్రపంచ బ్యాంకు సహా అనేక ఆర్ధిక సంస్థల నుంచి నిధులను సమీకరిస్తున్న విషయం తెలిసిందే. రెండు ప్రతిష్టాత్మకమైన బ్యాంకులతో పాటు హడ్కో కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. దీంతో అమరావతిలో అనేక నిర్మాణాలు చేపట్టేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను సీఆర్డీఏ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మోదీని అహ్వానించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి టీడీపీ ఎంపీలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. మరో పక్క ఈ రోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం కానుంది. అమరావతి నిర్మాణాల కోసం సీఆర్డీఏ ఆమోదించిన టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 

Related Posts

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది ప్ర‌భుత్వం తీరు: కేటీఆర్‌

నేటి భారత్ న్యూస్-బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇసుక మాఫీయాపై వ‌స్తున్న వార్త‌ల ప‌ట్ల ఆయ‌న ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా స్పందించారు. ఈ…

భారత్‌దే మాస్టర్స్ ట్రోఫీ.. ఫైనల్‌లో ఉద్రిక్తత.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన యువరాజ్ సింగ్.. టినో బెస్ట్

నేటి భారత్ న్యూస్- ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (ఐఎంఎల్) 2025 విజేతగా భారత్ అవతరించింది. సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని భారత మాస్టర్స్ జట్టు ఫైనల్‌లో వెస్టిండీస్‌ను మట్టికరిపించి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది ప్ర‌భుత్వం తీరు: కేటీఆర్‌

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది ప్ర‌భుత్వం తీరు: కేటీఆర్‌

భారత్‌దే మాస్టర్స్ ట్రోఫీ.. ఫైనల్‌లో ఉద్రిక్తత.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన యువరాజ్ సింగ్.. టినో బెస్ట్

భారత్‌దే మాస్టర్స్ ట్రోఫీ.. ఫైనల్‌లో ఉద్రిక్తత.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లిన యువరాజ్ సింగ్.. టినో బెస్ట్

 తెలంగాణలో రోప్‌ వే పర్యాటకం.. భువనగిరి కోట.. యాదగిరిగుట్టపై నిర్మాణం

 తెలంగాణలో రోప్‌ వే పర్యాటకం.. భువనగిరి కోట.. యాదగిరిగుట్టపై నిర్మాణం

బీసీసీఐ ‘ఫ్యామిలీ మెంబర్స్’ రూల్ పట్ల కోహ్లీ అసంతృప్తి!

బీసీసీఐ ‘ఫ్యామిలీ మెంబర్స్’ రూల్ పట్ల కోహ్లీ అసంతృప్తి!

మరికొన్ని గంటల్లో భూమ్మీదకు సునీత, విల్మోర్

మరికొన్ని గంటల్లో భూమ్మీదకు సునీత, విల్మోర్

అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే వంతెన ..

అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే వంతెన ..