నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీకి పయనం

నేటి భారత్ న్యూస్- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ (గన్నవరం) నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎంలు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఈ రాత్రికి ఇద్దరూ ఢిల్లీలో బస చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు. రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. ఈ క్రమంలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిధులతో పాటు పలు అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు. బుధవారం రాత్రికి ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం, డిప్యూటీ సీఎం అమరావతికి చేరుకుంటారు.   

Related Posts

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

నేటి భారత్ న్యూస్- తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద డీఈఓ, ఎంఈఓ, త‌హ‌సీల్దారుల ఫోన్ నంబ‌ర్లు ఉంచారు. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే వారి దృష్టికి తీసుకెళ్లాల‌ని…

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

నేటి భారత్ న్యూస్- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమ‌ల‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి శ్రీవారి సేవ‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు అర్ధాంగి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్రమంత్రి నారా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం