చైనా ఆర్మీలో కీలక జనరల్‌ హి వైడాంగ్ అరెస్ట్‌

నేటి భారత్ న్యూస్- చైనా సైన్యంలో కీలకమైన మరో జనరల్ ను అరెస్టు చేసినట్లు సమాచారం. సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ హి వైడాంగ్‌ సెక్రటరీ సైనిక సమాచారం లీక్ చేశారనే ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వైడాంగ్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఫుజియాన్ లో విధులు నిర్వహిస్తున్న పలువురు జనరల్స్ ను కూడా అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన హి వైడాంగ్ అరెస్టు వార్త ప్రస్తుతం చైనాలో సంచలనంగా మారింది.  సైన్యంలో అత్యంత కీలకంగా భావించే సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు స్వయంగా చైనా అధ్యక్షుడే చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కమిషన్ వైస్ చైర్మన్ ను అరెస్టు చేయడం గమనార్హం. ప్రభుత్వంలో, సైన్యంలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులను జిన్ పింగ్ ఇటీవల కాలంలో మార్చేస్తున్నారు. నాన్‌జింగ్‌ మిలిటరీ రీజియన్‌లో జనరల్‌ లాజిస్టిక్స్‌ అధిపతిగా పనిచేసిన ఝావో కేషిని కూడా ఇటీవల అరెస్టు చేశారు. గతేడాది కూడా మియావో లి అనే ఉన్నతస్థాయి సైనిక అధికారిని, అంతకుముందు ఏకంగా చైనా రక్షణ మంత్రిని అరెస్టు చేశారు.

Related Posts

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

నేటి భారత్ న్యూస్- తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద డీఈఓ, ఎంఈఓ, త‌హ‌సీల్దారుల ఫోన్ నంబ‌ర్లు ఉంచారు. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే వారి దృష్టికి తీసుకెళ్లాల‌ని…

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

నేటి భారత్ న్యూస్- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమ‌ల‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి శ్రీవారి సేవ‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు అర్ధాంగి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్రమంత్రి నారా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం