బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగింది: సీఎం చంద్రబాబు

నేటి భారత్ న్యూస్- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం గురించి చంద్రబాబు ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని వెల్లడించారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఏ విధంగా భాగస్వామ్యం కావొచ్చనే అంశంపై ఫలప్రదమైన చర్చ జరిగిందని తెలిపారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగ ఉపాధి కల్పన తదితర కీలక రంగాల్లో సేవలను మెరుగుపర్చడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతల వినియోగానికి ఉన్న అవకాశాలను చర్చించామని చంద్రబాబు వివరించారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్-2047 విజన్ ను సాకారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని… ఈ లక్ష్యాన్ని సాధించడంలో, ఏపీ ప్రజల సాధికారతను పెంచడంలో గేట్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం తమ సమయం, ఆలోచనలు, మద్దతు ఇస్తున్నందుకు బిల్ గేట్స్ కు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

Related Posts

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

నేటి భారత్ న్యూస్- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమైన విషయం విదితమే. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అటు నియోజకవర్గానికి కానీ, ఇటు అసెంబ్లీకి కానీ వెళ్లడంలేదు. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల…

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

నేటి భారత్ న్యూస్త– మిళనాడులోని తిరువణ్ణామలై కొండపై ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫ్రాన్స్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ గత జనవరిలో తిరువణ్ణామలైను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

 గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

 గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

భారత్ లో కాలు మోపుతున్న ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ

భారత్ లో కాలు మోపుతున్న ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ