హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ..తెలంగాణ సర్కార్‌తో కీలక ఒప్పందం

నేటి భారత్ న్యూస్- అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సంస్థ మెక్ డొనాల్డ్స్‌కు ప్రస్తుతం తెలంగాణలో 38 అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మరో మూడు లేదా నాలుగు కొత్త అవుట్‌లెట్‌లను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో బుధవారం సంస్థ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. 2 వేల మంది ఉద్యోగులతో ఈ సంస్థ కార్యాలయం హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో సదరు సంస్థ ఛైర్మన్, సీఈఓ క్రిస్ కెంప్‌జెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తమ గ్లోబల్ కార్యాలయ ఏర్పాటుకు సంబంధించి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సెంటర్ తమ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న తరుణంలో సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవడం గర్వంగా ఉందని సీఎం అన్నారు. ప్రభుత్వం తరపున సంస్థకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

Related Posts

 చంద్రబాబుకు మెసేజ్ చేసినా రెస్పాన్స్ రాలేదు: కేఏ పాల్

నేటి భారత్ న్యూస్- రాజమండ్రి శివార్లలో జరిగిన ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మరోవైపు ఆసుపత్రి వద్దకు చేరుకున్న కేఏ పాల్ పోస్టుమార్టం జరుగుతున్న మార్చురీ…

 భ‌ద్రాచ‌లంలో ఘోర ప్ర‌మాదం.. కుప్ప‌కూలిన ఆరంత‌స్తుల భ‌వ‌నం

నేటి భారత్ న్యూస్- భ‌ద్రాచ‌లంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. భ‌ద్రాచ‌లం సూప‌ర్ బ‌జార్ సెంటర్‌లో పంచాయ‌తీ కార్యాల‌యం వ‌ద్ద‌ నిర్మాణంలో ఉన్న ఆరంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు మృతిచెంద‌గా, శిథిలాల కింద న‌లుగురు చిక్కుకున్న‌ట్లు స‌మాచారం. ఈ ప్ర‌మాదానికి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

కుటుంబ గొడవలపై మంచు విష్ణు భార్య విరానిక కీలక వ్యాఖ్యలు

కుటుంబ గొడవలపై మంచు విష్ణు భార్య విరానిక కీలక వ్యాఖ్యలు

 చంద్రబాబుకు మెసేజ్ చేసినా రెస్పాన్స్ రాలేదు: కేఏ పాల్

 చంద్రబాబుకు మెసేజ్ చేసినా రెస్పాన్స్ రాలేదు: కేఏ పాల్

 భ‌ద్రాచ‌లంలో ఘోర ప్ర‌మాదం.. కుప్ప‌కూలిన ఆరంత‌స్తుల భ‌వ‌నం

 భ‌ద్రాచ‌లంలో ఘోర ప్ర‌మాదం.. కుప్ప‌కూలిన ఆరంత‌స్తుల భ‌వ‌నం

ఎంఎంటీఎస్ రైలు అత్యాచారయత్నం, ఉప ఎన్నికల అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి

ఎంఎంటీఎస్ రైలు అత్యాచారయత్నం, ఉప ఎన్నికల అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి

 చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌!

 చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌!

మేడిగడ్డ బ్యారేజీ, ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

మేడిగడ్డ బ్యారేజీ, ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన