దేవ్‌మాలిపై వ్యూ అద్భుతం… కానీ ఆ విష‌యం న‌న్ను బాధించింది: రాజ‌మౌళి

నేటి భారత్ న్యూస్- టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కాంబినేష‌న్‌లో ‘ఎస్ఎస్ఎంబీ 29’ ప్రాజెక్టు తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ మూవీ ఒడిశాలో షూటింగ్ జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా జ‌క్క‌న్న ఒడిశాలోని ప్ర‌ఖ్యాత దేవ్‌మాలి శిఖ‌రంపై ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ట్రెక్కింగ్ అనుభ‌వాన్ని ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంద‌ని, కానీ ఒక విష‌యం త‌న‌ను తీవ్రంగా బాధించింద‌ని రాజ‌మౌళి ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్టు పెట్టారు. “ఒడిశాలోని అత్యంత ఎత్తైన, అద్భుతమైన శిఖరం దేవ్‌మాలిపై సోలో ట్రెక్కింగ్ చేశాను. శిఖ‌రంపై నుంచి వ్యూ అత్య‌ద్భుతం. ఆ దృశ్యాలు చాలా ఉత్కంఠభరితంగా, ఇట్టే క‌ట్టి ప‌డేస్తాయి. అయితే, ఇంత సుంద‌ర‌మైన ప్ర‌దేశంలో అప‌రిశుభ్ర ప‌రిస్థితులు న‌న్ను తీవ్రంగా బాధించాయి. ట్రెక్కింగ్‌కు వ‌చ్చిన సంద‌ర్శ‌కులు వారు వాడిన వ‌స్తువుల‌ను అక్క‌డే ప‌డేయ‌కుండా త‌మ‌తో పాటు తిరిగి తీసుకెళ్లాలి” అని జ‌క్క‌న్న ట్వీట్ చేశారు.

Related Posts

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

నేటి భారత్ న్యూస్-పోలీస్ శాఖలో ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి. మొదట చిత్తూరు జిల్లాలో చేపట్టిన ఈ ప్రక్రియను, తాజాగా అన్నమయ్య జిల్లాలో కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 264 మంది సిబ్బందిని బదిలీ చేసిన అధికారులు, తాజాగా అన్నమయ్య జిల్లాలో 364 మంది…

భర్తను అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేసిన ముస్కాన్..

నేటి భారత్ న్యూస్- సంచలనం సృష్టించిన మీరట్ హత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. కన్నబిడ్డ పుట్టిన రోజు కోసం లండన్ నుంచి వచ్చిన భర్త సౌరభ్‌ను ప్రియుడు సాహిల్‌ శుక్లాతో కలిసి దారుణంగా హతమార్చిన ముస్కాన్ రస్తోగి 11…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

భర్తను అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేసిన ముస్కాన్..

భర్తను అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేసిన ముస్కాన్..

ఆ విషయంలో ట్రంప్ కంటే బైడెన్‌యే బెటర్‌!

ఆ విషయంలో ట్రంప్ కంటే బైడెన్‌యే బెటర్‌!

 ఐపీఎల్ ప్రారంభానికి ముందు వివాదానికి తెరతీసిన ఆర్సీబీ..

 ఐపీఎల్ ప్రారంభానికి ముందు వివాదానికి తెరతీసిన ఆర్సీబీ..