ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

నేటి భారత్ న్యూస్-సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం విశాఖపట్నంలో స్టూడియోల నిర్మాణానికి గతంలో ప్రభుత్వం భూములు కేటాయించింది. ఆ క్రమంలో ప్రముఖ నిర్మాత రామానాయుడు స్టూడియో నిర్మాణానికి 35 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ భూమిని స్టూడియో కోసం వినియోగించకుండా కొంత భూమిని లేఅవుట్లు వేసి విక్రయించే ప్రయత్నాలు జరిగాయి. ఆ నేపథ్యంలో విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు న్యాయపోరాటం ద్వారా లేఅవుట్ విక్రయాలను నిలుపుదల చేయించారు. తాజాగా ఆయన ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. రామానాయుడు స్టూడియోకు గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఈ స్టూడియో నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం 35 ఎకరాలను కేటాయించగా, అందులోని 15.17 ఎకరాల్లో లేఅవుట్లు వేసి విక్రయించాలని గత ప్రభుత్వ హయాంలో ప్రయత్నించారని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమిని స్టూడియో కోసం వినియోగించడం లేనందున ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు.

Related Posts

 ఏడు కొండలు… వెంకటేశ్వరస్వామి సొంతం: సీఎం చంద్రబాబు

నేటి భారత్ న్యూస్-నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబం ప్రస్తుతం తిరుమలలో ఉన్న సంగతి తెలిసిందే. అన్నప్రసాద కేంద్రంలో మనవడి పేరిట అన్న వితరణ చేసిన అనంతరం చంద్రబాబు స్థానిక పద్మావతి అతిథి గృహంలో కీలక సమీక్ష చేపట్టారు.…

లండన్ ఎయిర్‌పోర్టుకు నిలిచిన విద్యుత్… అన్ని విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా

నేటి భారత్ న్యూస్- లండన్ లోని హీత్రూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రపంచంలోని అత్యంత రద్దీ ఎయిర్ పోర్టుల్లో ఒకటి. అలాంటి వరల్డ్ క్లాస్ విమానాశ్రయంలో తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇక్కడి సబ్ స్టేషన్ లో విద్యుత్ వ్యవస్థలో భారీ అగ్నిప్రమాదం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 ఏడు కొండలు… వెంకటేశ్వరస్వామి సొంతం: సీఎం చంద్రబాబు

 ఏడు కొండలు… వెంకటేశ్వరస్వామి సొంతం: సీఎం చంద్రబాబు

లండన్ ఎయిర్‌పోర్టుకు నిలిచిన విద్యుత్… అన్ని విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా

లండన్ ఎయిర్‌పోర్టుకు నిలిచిన విద్యుత్… అన్ని విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు