ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

నేటి భారత్ న్యూస్- భారత్‌కు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రికార్డుస్థాయి ధర పలికింది. ‘గ్రామయాత్ర’ పేరుతో గీసిన చిత్రం వేలంలో ఏకంగా రూ. 118 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో భారతీయ చిత్ర కళలో ఇది అత్యంత ఖరీదైన కళాఖండంగా రికార్డులకెక్కింది. హుస్సేన్ ఈ చిత్రాన్ని 1950లలో గీశారు. న్యూయార్క్‌లోని క్రిస్టీలో ఈ నెల 19న ఈ వేలం నిర్వహించగా రికార్డుస్థాయి ధర పలికింది. ప్రసిద్ధ చిత్రకారిణి అమృతా షేర్‌గిల్ 1937లో గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రానికి 2023లో ముంబైలో నిర్వహించిన వేలంలో రూ. 61.8 కోట్ల ధర పలికింది. ఇప్పుడు హుస్సేన్ చిత్రం ఆ రికార్డును బద్దలుగొట్టి దేశ చిత్ర కళలో అత్యంత ఖరీదైన కళాఖండంగా నిలిచింది. 14 అడుగుల కాన్వాస్ కలిగి ఉన్న హుస్సేన్ ‘గ్రామయాత్ర’ చిత్రం.. అప్పటికి కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశంలోని గ్రామీణ జనజీవన వైవిధ్యాన్ని తెలియజేస్తోంది. ఈ చిత్రాన్ని 1954లో నార్వేకు చెందిన డాక్టర్ లియాన్ ఎలియాస్ వొలొదార్ స్కీ కొనుగోలు చేసి 1964లో ఓస్లో యూనివర్సిటీ ఆసుపత్రికి అందించారు. ఇప్పుడీ చిత్రాన్ని అమ్మగా వచ్చిన మొత్తాన్ని యూనివర్సిటీ వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తారు.

Related Posts

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

నేటి భారత్ న్యూస్- ఏపీ కష్టాల్లో ఉన్న సమయంలో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని… మొత్తం 175 సీట్లలో 164 సీట్లను కట్టబెట్టి ఘన విజయం అందించారని చెప్పారు. కూటమికి 21 ఎంపీ స్థానాలను కట్టబెట్టారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా…

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

నేటి భారత్ న్యూస్- లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని, డీలిమిటేషన్‌ను ప్రశ్నించని పక్షంలో చరిత్ర తమను క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

 చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

 చెన్నైలో మాఫియా ముఠా సమావేశం జరుగుతోంది.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అనుకొనే హాజరయ్యారు: బండి సంజయ్

ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన

ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన