తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

నేటి భారత్ న్యూస్- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమ‌ల‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి శ్రీవారి సేవ‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు అర్ధాంగి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్రమంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు.  సీఎం చంద్ర‌బాబుకు ఆల‌య మ‌హాద్వారం వ‌ద్ద టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు, అర్చ‌కులు లాంఛ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. త‌రిగొండ వెంగ‌మాంబ స‌త్రంలో దేవాన్ష్ పేరుతో అన్న‌దానం నిర్వ‌హించ‌నున్నారు. చంద్ర‌బాబు కుటుంబం మ‌ధ్యాహ్నం తిరుమ‌ల నుంచి బ‌య‌ల్దేరి హైద‌రాబాద్ చేరుకుంటారు.  కాగా, స్వామివారి ద‌ర్శ‌నం కోసం గురువారం రాత్రి చంద్ర‌బాబు తిరుమల చేరుకున్నారు. పద్మావతి విశ్రాంతి గృహం దగ్గర టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి రామానారాయణ రెడ్డి, టీటీడీ ఈఓ శ్యామలరావు తదితరులు చంద్ర‌బాబు కుటుంబానికి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బస చేసిన సీఎం కుటుంబం… శుక్రవారం ఉదయం స్వామివారి సేవ‌లో పాల్గొంది.

Related Posts

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

నేటి భారత్ న్యూస్-పోలీస్ శాఖలో ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి. మొదట చిత్తూరు జిల్లాలో చేపట్టిన ఈ ప్రక్రియను, తాజాగా అన్నమయ్య జిల్లాలో కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 264 మంది సిబ్బందిని బదిలీ చేసిన అధికారులు, తాజాగా అన్నమయ్య జిల్లాలో 364 మంది…

భర్తను అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేసిన ముస్కాన్..

నేటి భారత్ న్యూస్- సంచలనం సృష్టించిన మీరట్ హత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. కన్నబిడ్డ పుట్టిన రోజు కోసం లండన్ నుంచి వచ్చిన భర్త సౌరభ్‌ను ప్రియుడు సాహిల్‌ శుక్లాతో కలిసి దారుణంగా హతమార్చిన ముస్కాన్ రస్తోగి 11…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

అన్నమయ్య జిల్లాలో 364 మంది పోలీసు సిబ్బంది బదిలీ

భర్తను అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేసిన ముస్కాన్..

భర్తను అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేసిన ముస్కాన్..

ఆ విషయంలో ట్రంప్ కంటే బైడెన్‌యే బెటర్‌!

ఆ విషయంలో ట్రంప్ కంటే బైడెన్‌యే బెటర్‌!

 ఐపీఎల్ ప్రారంభానికి ముందు వివాదానికి తెరతీసిన ఆర్సీబీ..

 ఐపీఎల్ ప్రారంభానికి ముందు వివాదానికి తెరతీసిన ఆర్సీబీ..

పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ.. కోర్టు పెట్టిన కండిషన్స్ ఇవే!

పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ.. కోర్టు పెట్టిన కండిషన్స్ ఇవే!

నేటి నుంచే ఐపీఎల్ మ‌హాసంగ్రామం.. టాప్‌లో వీరే..!

నేటి నుంచే ఐపీఎల్ మ‌హాసంగ్రామం.. టాప్‌లో వీరే..!